
IBO store Tirupati grand opened

తిరుపతిలో ఐబీఓ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ – ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్టోర్ ప్రారంభం
తిరుపతి: ప్రముఖ బిల్డింగ్ మెటీరియల్ రిటైల్ సంస్థ IBO Tirupati ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి స్టోర్‌ను ఈరోజు తిరుపతిలో ఘనంగా ప్రారంభించింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సౌత్ ఇండియాలో ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఐబీఓ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమని తెలిపారు. సమీప కాలంలో ప్రధాన నగరాల్లో 20కి పైగా స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
వందలాది ప్రముఖ బ్రాండ్లతో కూడిన ఈ స్టోర్‌లో బిల్డింగ్ మెటీరియల్స్, టైల్స్, పెయింట్స్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్స్ వంటి అన్ని అవసరాలు ఒకే చోట లభ్యమవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, తక్కువ ధరల్లో నాణ్యమైన ఒరిజినల్ ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
డిస్కౌంట్లు మరియు ఆఫర్లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ సేవలను అందించే ఈ స్టోర్‌ను తిరుపతి నుంచి ప్రారంభించడం విశేషమని పేర్కొన్నారు. త్వరలోనే తిరుపతిలోనే మరో స్టోర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రారంభ రోజే భారీ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం గొప్ప విజయమని చెప్పారు. మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండటంతో కస్టమర్లు భారీగా స్పందిస్తున్నారని తెలిపారు.
కస్టమర్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “బయటి మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్లు లభిస్తున్నాయి. అందుకే ఇంత భారీగా కొనుగోలు జరుగుతోంది” అని ఆనందం వ్యక్తం చేశారు.
- tirumala farests
- Chittoor High Road Expansion: ₹37.41 Crore Sanctioned for 4-Lane Road from Kattamanchi to MSR
- D.K. Shivakumar: From Congress Troubleshooter to Karnataka Chief Minister
- ₹25 Crore Hare Krishna Temple Project Proposed in Chittoor, CM Assures Land Allocation
- Dr. M. Sudhakar Biography: From Renowned Doctor to Katpadi MLA and People’s Leader



