IBO Tirupati 2nd store grand Open
తిరుపతిలో ఐబో రెండో స్టోర్ ప్రారంభం మై టోలెట్ ఇండియా సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న ప్రముఖ బిల్డింగ్ మెటీరియల్ రిటైల్ సంస్థ తిరుపతి, జూలై 5: ప్రముఖ బిల్డింగ్ మెటీరియల్ రిటైల్ సంస్థ ఐబో (IBO) తిరుపతిలో తన రెండో స్టోర్‌ను శనివారం ఘనంగా ప్రారంభించింది. కరకంబాడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లను ప్రకటించారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే వర్తించే ఈ ప్రత్యేక ఆఫర్లలో రూ.500 కొనుగోలుపై రూ.200 క్యాష్‌బ్యాక్, రూ.5,000 కొనుగోలుపై ఎలక్ట్రిక్ కెటిల్, రూ.25,000 కొనుగోలుపై కేబిన్ ట్రాలీ బ్యాగ్, రూ.50,000 కొనుగోలుపై ఎయిర్ ఫ్రైయర్, రూ.1 లక్షకు పైబడిన కొనుగోలుపై బోట్ సౌండ్‌బార్‌ను బహుమతిగా అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏరియా మేనేజర్ నందకిషోర్, మార్కెటింగ్ ఇన్చార్జి పవన్ కుమార్, స్టోర్ మేనేజర్ మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మై టోలెట్ ఇండియా – ప్రాపర్టీ సర్వీసెస్ ఇన్ సౌత్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ బాలాజీ నాయుడు బల్లా మాట్లాడుతూ, ఐబో సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన తొలి రెండు స్టోర్లకు అవసరమైన కమర్షియల్ ప్రాపర్టీలను తమ సంస్థ ద్వారా అందించడం గర్వకారణమని తెలిపారు. అలాగే తమిళనాడులోని సూళ్లూరు సమీపంలో ప్రారంభించిన మరో ఐబో స్టోర్ కూడా తమ సంస్థ ద్వారానే ఏర్పాటు చేయబడిందని చెప్పారు. సంస్థ ప్రతినిధులతో నిరంతర సమన్వయం, సరైన ప్రాపర్టీల గుర్తింపు, వ్యాపార అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడం వల్ల ఐబో వంటి జాతీయ స్థాయి సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాగలిగామని ఆయన పేర్కొన్నారు. గత నెల తిరుపతిలో ప్రారంభమైన తొలి స్టోర్‌కు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించడం, వ్యాపారపరంగా మంచి ఫలితాలు రావడం వల్ల ఐబో యాజమాన్యం తమపై మరింత విశ్వాసం ఉంచిందని వెల్లడించారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల విస్తరణలో మై టోలెట్ ఇండియా కీలక భాగస్వామిగా నిలిచి, వ్యాపార సంస్థలకు సమగ్ర ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు బాలాజీ నాయుడు తెలిపారు.