Home Blog Real estate news Steps towards a Smart Chittoor: A modern bus station and commercial complex at the old bus stand with an investment of ₹100 crore.
Steps towards a Smart Chittoor: A modern bus station and commercial complex at the old bus stand with an investment of ₹100 crore.

Steps towards a Smart Chittoor: A modern bus station and commercial complex at the old bus stand with an investment of ₹100 crore.

స్మార్ట్ చిత్తూరు దిశగా మరో కీలక అడుగు
మాట నిలబెట్టుకుంటున్న ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్
చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తన మాటను నిలబెట్టుకుంటున్నారు.
రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ (Public–Private Partnership) విధానంలో చిత్తూరు పాత బస్టాండ్ స్థలంలో మోడ్రన్ బస్ స్టేషన్‌తో పాటు మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందించడంతో పాటు, చిత్తూరు నగరానికి నూతన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడనున్నాయి. మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, స్థానిక వ్యాపారాలకు మరింత ఊతం లభించనుంది.
అత్యాధునిక సదుపాయాలతో కూడిన బస్ టెర్మినల్, పార్కింగ్ సౌకర్యాలు, షాపింగ్ ఏరియాలు, కార్యాలయ స్థలాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నగర సుందరీకరణతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.
చిత్తూరు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయకత్వంలో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆమోదం పొందితే, నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Add comment

Our Newsletter

Get subscribed today!

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing. Ut eleifend scelerisque nisi mauris
Get subscribed today!
© 2025 Mytoetindia - Design By Premiumweb.in

Whether you want to rent your new apartment, house or room, Commercial purposes you will find a big selection in all price ranges. 

Contact Us

E-mail:

info@mytoletindia.in

Phone Number:

07093737883

All Copyright Reserved to Mytoletindia 2025.